పాదచారుల కోసం జానకి వంతెన ప్రారంభం...

Singh Rawat inaugurated Janaki Setu a three lane pedestrian bridge on river Ganga

ఉత్తరాఖండ్‍ తెహ్రీ గర్హ్వాల్లోని మునికి రెటి ప్రాంతంలో గంగానదిపై నిర్మించిన జానకి వంతెనను ఆ రాష్ట్ర సీఎం త్రివేంద్రసింగ్‍ రావత్‍ శుక్రవారం సాయంత్రం జాతికి అంకితం చేశారు. 346 మీటర్ల పొడవైన ఈ పాదచారుల వేలాడే వంతెన నిర్మాణానికి ప్రభుత్వం రూ.48.85 కోట్లు వెచ్చించింది. మూడు వరుసలో ఈ వంతెనను నిర్మించారు. ఇక్కడ వంతెన లేకపోవడంతో దశాబ్దాలుగా భక్తులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని సీఎం తెలిపారు. అలాగే త్వరలో పౌరిలోని సిన్‍తాలి-బీన్‍ నదుల మధ్య ఓ వంతెన నిర్మాణాన్ని కూడా ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు.  బజరంగ్‍ సేతుగా దీనికి నామకరణం చేయనున్నట్లు ప్రకటించారు. దీన్ని పూర్తిగా ప్రత్యేక గాజుతో కళాత్మకంగా నిర్మిస్తామని పేర్కొన్నారు.