
ప్రముఖ ఓటీటీ (ఓవర్ ది టాప్) స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ త్వరలో దేశీయంగా రెండ్రోజులపాటు ‘స్ట్రీమ్ఫెస్ట్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నది. డిసెంబర్ 5 తెల్లవారుజాము 12.01 గంటల నుంచి డిసెంబర్ 6 రాత్రి 11.59 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు నెట్ఫ్లిక్స్ శుక్రవారం వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు నెట్ఫ్లిక్స్ లొ చందాదారులుగా చేరనివారు ఆ రెండు రోజులపాటు ఆ ప్లాట్ఫామ్ సేవలను ఉచితంగా పొందేందుకు వీలవుతుంది. కొత్త వినియోగదారులను ఆకర్షించాలన్న లక్ష్యంతో నెట్ఫ్లిక్స్ స్ట్రీమ్ఫెస్ట్ ను నిర్వహించనున్నది.