అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం

8 Injured In Shooting At US Mall In Wisconsin Gunman Missing

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేపాయి. విస్కాన్సిన్‍లోని ఒక మాల్‍లో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఎనిమిది మంది గాయపడ్డారు. కాల్పులు జరిపిన యువకుడిని పట్టుకునేందుకు పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. విస్కాన్సిన్‍లోని వావటోసాలోని మేఫేర్‍ మాల్‍లో శ్వేతజాతి యువకుడి కాల్పులు జరిపి పారిపోయినట్టుగా ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించామని తెలిపారు. వారిలో ఏడుగురు పెద్దలు, ఒక యువకుడు ఉన్నారు. షూటర్‍ కోసం గాలిస్తున్నామని వావటోసా పోలీసు విభాగం ఒక ప్రకటనలో తెలిపింది.

 


                    Advertise with us !!!