
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబాన్ని కరోనా వైరస్ ఇప్పట్లో వదిలేట్లు లేదు. ఎన్నికలకు 20 రోజుల ముందు ట్రంప్‌తోపాటు ఆయన సతీమణి మెలానియా ట్రంప్ కరోనా బారినపడగా, తాజాగా ఆయన పెద్ద కొడుకు జూనియర్ డొనాల్డ్ ట్రంప్ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ వారం ప్రారంభంలో నిర్వహించిన కరోనా పరీక్షల్లో జూనియర్ ట్రంప్‌కు పాజిటివ్ వచ్చిందని అధికారులు తెలిపారు. ఫలితాలు వచ్చినప్పటి నుంచి ఆయన క్వారంటైన్లో ఉన్నారని చెప్పారు. జూనియర్ ట్రంప్‌కు ఎలాంటి లక్షణాలు లేవని, కరోనా నిబంధనల ప్రకారం వైద్యం పొందుతున్నారని వెల్లడించారు.