
కరోనా చికిత్సలో సత్ఫలితాలు ఇస్తోందని ఇన్నాళ్లూ భావిస్తూ వచ్చిన యాంటీ వైరల్ డ్రగ్ రెమిడెసివిర్తో కలిగే ప్రయోజనం ఏమీ లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) తెలిపింది. గిలియాడ్ సంస్థకు చెందిన ఈ ఔషధంతో కరోనా రోగులు కోలుకుంటారని, వారి ప్రాణాలు కాపాడగలమనడానికి ఎలాంటి ఆధారాలు లేవని డబ్ల్యూహెచ్వో సృష్టం చేసింది. రెమిడెసివిర్ ఇచ్చిన 7 వేలకు పైగా కోవిడ్ రోగుల్ని అధ్యయనం చేసిన తర్వాత దాంతో వచ్చే ఉపయోగం లేదని అంతర్జాతీయ ఆరోగ్య నిపుణులతో కూడిన డబ్ల్యూహెచ్వో గైడ్లైన్ డెవలప్మెంట్ గ్రూప్ అభిప్రాయపడింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసుపై గిలియాడ్ సంస్థ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.