
కరోనా టీకా విషయంలో మరో కీలక అడుగు పడింది. తమ టీకాకు అత్యవసర అనుమతివ్వాలని కోరుతూ అమెరికా ఆహారా ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్డీఏ)కు ఫైజర్ దరఖాస్తు చేసింది. అనుమతి లభించిన 24 గంటల్లో టీకా, పరిమిత సంఖ్యలో అమెరికా ప్రజలకు అందుబాటులోకి రానుంది. వచ్చే నెల రెండో వారానికల్లా ఎఫ్డీఏ అనుమతి లభించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.