ట్రేసీలో ఫుడ్‌ షెల్టర్‌కు తానా-బాటా ఆర్థిక సహాయం

tana bata food drive programme in tracy

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), బే ఏరియా తెలుగు అసోసియేషన్‌ (బాటా) కలిసి నిరుపేదలను ఆదుకునేందుకు ఫుడ్‌ డ్రైవ్‌ కార్యక్రమాన్ని బే ఏరియాలో ముమ్మరంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా స్టాక్‌టన్‌లోని ఎమర్జెన్సీ ఫుడ్‌ సెంటర్‌, ట్రేసీలోని మెక్‌హెన్రీ ఫ్యామిలీ షెల్టర్‌కు 2000డాలర్ల చెక్కును తానా, బాటా నాయకులు విరాళంగా ఇచ్చారు. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు, తానా, బాటా సభ్యులకు, వలంటీర్లకు ఈ సందర్భంగా తానా నాయకులు రజనీకాంత్‌ కాకర్ల, భక్తబల్లా, సతీష్‌ వేమూరి ధన్యవాదాలు చెప్పారు.  ఇతర నగరాల్లో కూడా దాదాపు 10,000 డాలర్ల విలువైన ఆహారపదార్థాలను పంపిణీ చేయనున్నట్లు కూడా వారు చెప్పారు.