పండుగ సమయంలో అత్యంత ఎక్కువ విక్రయాలను రికార్డు దాఖలు చేసుకున్న ఎంఐ ఇండియా

Mi India registers highest ever festive sales

భారతదేశపు నం.1 స్మార్ట్‌ ఫోన్ మరియు స్మార్ట్‌ టీవీ బ్రాండ్ ఎంఐ ఇండియా ఈ పండుగ సీజన్‌లో 13 మిలియన్ల పైచిలుకు ఉపకరణాలను విక్రయించినట్లు ప్రకటించింది. రెడ్ క్వాంటా నుంచి శ్రేష్ఠత కలిగిన స్మార్ట్‌ఫోన్లను విక్రయిస్తున్న బ్రాండ్‌గా గుర్తింపు పొందిన కంపెనీ 9 మిలియన్ స్మార్ట్ ‌ఫోన్లను విక్రయించగా వాటిలో ఎంఐ 10టి ప్రో, రెడ్‌మి 9 ప్రో మ్యాక్స్, రెడ్‌మి నోట్ 9 ప్రో, రెడ్‌మి 9 ప్రైమ్, రెడ్‌మి 9, రెడ్‌మి 9ఎ తదితర మోడళ్లు ఉన్నాయి. దీనితో ఎంఐ ఇండియా పండుగ విక్రయాల్లో ఎకోసిస్టం ఉత్పత్తులకు గమనార్హమైన డిమాండ్‌ను చూసింది మరియు టీవీలు, స్ట్రీమింగ్ ఉపకరణాలు, ట్రిమ్మర్లు, స్మార్ట్ బ్యాండ్లు, ఆడియో ఉత్పత్తులు, పవర్ బ్యాంకులు తదితరాల విభాగాల్లో 4 మిలియన్ల పైచిలుకు ఉపకరణాలను విక్రయించింది. కొత్తగా విడుదలైన ఎంఐ వాచ్ రివాల్వ్, ఎంఐ స్మార్ట్ స్పీకర్ వినియోగదారులకు అత్యంత ప్రీతిపాత్రమైన ఉపకరణాలుగా నిలిచాయి. అదనంగా ఎంఐ బాక్స్ 4కె మరియు ఎంఐ టీవీ స్టిక్ అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్‌లో అత్యంత ఎక్కువ విక్రయం అవుతున్న స్ట్రీమింగ్ ఉపకరణాలుగా నిలిచాయి.

ఎంఐ ఇండియా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రఘు రెడ్డి మాట్లాడుతూ ‘‘ఎంఐ ఇండియా ఈ పండుగ సీజన్‌లో స్మార్ట్‌ఫోన్లు తదితర ఉత్పత్తుల విభాగంలో 13 మిలియన్ ఉపకరణాల్లో గతంలో కన్నా అత్యంత ఎక్కువ ఎక్కువ విక్రయాలతో రికార్డు నమోదు చేశామని అందరితో పంచుకోవడం థ్రిల్‌గా ఉంది. మేము విస్తృత శ్రేణి ఎంపిక ఉత్పత్తుల విడుదల చేశాము మరియు మా వినియోగదారుల అవసరాలను భర్తీ చేసేందుకు అత్యుత్తమ ఆఫర్లు అలానే ఇనీషియేటివ్స్ అయిన ఎంఐ స్మార్ట్ అప్‌గ్రేడ్‌ను పరిచయం చేశాము. 13 మిలియన్ ఉపకరణాల విక్రయ మైలురాయిని చేరడం బ్రాండ్‌గా మాత్రమే కాకుండా వ్యాపార పరిశ్రమకు భరోసాను తీసుకు వచ్చాము. మేము 4వ త్రైమాసికంలో ఎక్కువ డిమాండ్‌ను నిరీక్షిస్తున్నాము మరియు ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఏడాది చివరికి మమ్మల్ని మేము సిద్ధం చేసుకుంటున్నాము. మా ఎంఐ అభిమానులు మరియు వినియోగదారుల నుంచి మేము అందుకున్న ప్రతిస్పందనలు మాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది మరియు వినియోగదారులే మొదటి బ్రాండ్‌గా మేము ప్రామాణికమైన ధరల్లో అత్యుత్తమ నాణ్యత కలిగిన ఉత్పత్తులను అందించే భరోసాను కొనసాగిస్తున్నామని’’ పేర్కొన్నారు.

ఈ పండుగ సీజన్‌లో ఎంఐ ఇండియా మొదటిసారి వినియోగదారులు అలానే ప్రస్తుతం ఉన్న వినియోగదారులకు సేవలు అందించేందుకు అనువైన అన్ని పిన్‌కోడ్‌లలో అసాధారణ డిమాండ్‌ను తీసుకు వచ్చింది.

 • స్మార్ట్ ఫోన్లు
 • ఈ అవధిలో 9 మిలియన్ల పైచిలుకు ఎక్కువ స్మార్ట్ ఫోన్లను అన్ని ప్లాట్‌ఫారాలపై విక్రయించింది.
 • ఎంఐ 10టి ప్రో, రెడ్‌మి నోట్ 9 ప్రో మ్యాక్స్, రెడ్‌మి నోట్ 9 ప్రో, రెడ్‌మి ప్రైమ్, రెడ్‌మి 9, రెడ్‌మి 9 ఎ ఈ పండుగ సీజన్‌లో అత్యుత్తమంగా విక్రయమైన ఉపకరణాలు.
 • స్మార్ట్‌ టీవీ
 • 4 మిలియన్ స్మార్ట్ టీవీలు, ఎంఐ ఎకోసిస్టం ఉత్పత్తులు మరియు యాక్ససరీలను విక్రయించింది
 • ఈ దీపావళిలో 450కె+ ఎంఐ టీవీలు మరియు హోమ్ ఎంటర్‌టెయిన్‌మెంట్ ఉత్పత్తులు విక్రయించింది.
 • 4కె టీవీలు గత ఏడాది నుంచి అత్యంత ఎక్కువ విక్రయాలను చేసుకోగా, పెద్ద స్క్రీన్ పరిమాణం 50/55 అంగుళాలు విభాగం గత ఏడాది 50% వృద్ధిని చూసింది.
 • ఈ పండుగ సీజన్‌లో 10 మిలియన్ మేడ్ ఇన్ ఇండియా ఎంఐ పవర్ బ్యాంకుల మైలురాయిని చేరుకుంది.
 • ఎంఐ ఎయిర్ ప్యూరిఫైయర్ల విక్రయం 100% వృద్ధి సాధించింది.
 • కొత్తగా విడుదలైన ఉత్పత్తులైన ఎంఐ వాచ్ రిసాల్వ్ మరియు ఎంఐ స్మార్ట్ స్పీకర్ ఎంఐ అభిమానులు మరియు వినియోగదారుల నుంచి చక్కని ప్రతిస్పందన అందుకుంది.
 • ఎంఐ స్మార్ట్ బ్యాండ్ ఫిట్‌నెస్ విభాగంలో అత్యుత్తమ విక్రయాలు జరుపుకుంటున్న ఉత్పత్తుల్లో ఒకటిగా ఉంది.