అమెరికాతో వాణిజ్య బంధం తెంచుకోం

Amid US China trade war Donald Trump and Xi Jinping to meet at virtual Asia Pacific meet

అమెరికాతో వాణిజ్య సంబంధాలను చైనా తెంచుకోనున్నట్లు వస్తున్న ఊహాగానాలను ఆ దేశాధ్యక్షుడు షి జిన్‍పింగ్‍ కొట్టిపారేశారు. సాంకేతికత, భద్రతాపరమైన వ్యవహారాల్లో ఐరోపా దేశాలు, అమెరికాతో ప్రస్తుతం ఉద్రికత్తలు నెలకొన్నప్పటికీ... వాటితో ఆర్థిక, వాణిజ్యపరమైన సంబంధాలను తాము కొనసాగిస్తామని సృష్టం చేశారు. ఆసియా-పసిఫిక్‍ ఆర్థిక సహకారం (అపెక్‍) ఆధ్వర్యంలో జరిగిన సీఈవోల సదస్సులో జిన్‍ పింగ్‍ వీడియో లింక్‍ ద్వారా ప్రసంగించారు. వచ్చే ఏడాది నుంచి చైనా నూతన అభివృద్ధి నమూనాను అనుసరిస్తుందని ఆయన తెలిపారు. ఇకపై ఎగుమతుల ఆధారిత అభివృద్ధి కంటే దేశీయ వినియోగానికి ప్రాధాన్యమిస్తామని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. తమ దేశ విపణిలో కంపెనీలకూ అవకాశాలు కల్పిస్తామన్నారు.