మిన్నెసోటాలో దీపావళి వేడుకలు

TEAM Deepawali Celebrations 2020

అమెరికాలోని మిన్నెసోటా నగరంలో దీపావళి, బాలవినోదం వేడుకలు తెలుగు అసోసియేషన్‍ ఆధ్వర్యంలో వైభవంగా జరిగాయి. కొవిడ్‍ నేపథ్యంలో వర్చువల్‍ విధానంలో నిర్వహించిన ఈ సంబురాల్లో 1600 మందికి పైగా పాల్గొన్నట్లు అసోసియేషన్‍ అధ్యక్షుడు రాము తోడుపునూరి తెలిపారు. పిల్లలకు ఫ్యాన్సీ డ్రెస్‍ పోటీలు నిర్వహించారు.