
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 60 డివిజన్లలో పోటీ చేయాలని ఎంఐఎం పార్టీ నిర్ణయించింది. గతసారి 44 డివిజన్లలో గెలిచిన ఎంఐఎం.. ఈసారి తమకు ప్రాబల్యం ఉన్న చార్మినార్; బహదూర్‌పురా, యాకుత్‌పురా, కార్వాన్, ఆసిఫ్‌నగర్, చాంద్రాయణగుట్ట, మలక్‌పేట, రాజేంద్రనగర్ నియోజకవర్గాల పరిధిలోని దాదాపు అన్ని డివిజన్లలో అభ్యర్థులను పోటీకి దించేందుకు సిద్ధమైంది. మిగతా 90 డివిజన్లలో అధికార పార్టీ టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వనున్నట్టు ఆ పార్టీ వర్గాలు ప్రకటించాయి.