
అమెరికాలోని పేదలను ఆదుకునేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం చేపట్టిన ఫుడ్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా తానా మిడ్ అట్లాంటిక్ టీమ్ ఫిలడెల్ఫియాలో ఫుడ్ డ్రైవ్‌ను నిర్వహించింది. డాయెల్స్టౌన్లో ఉన్న బ్రిటన్ ఫుడ్ లాదర్కు ఫుట్ ఐటెమ్స్‌ను విరాళంగా అందజేసింది. తానా కార్యదర్శి రవి పొట్లూరి, మిడ్ అట్లాంటిక్ విభాగం తానా కో ఆర్డినేటర్ సతీష్ చుండ్రు తదితరుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. తానా ఆధ్వర్యంలో వివిధ నగరాల్లో కూడా ఫుడ్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టారు. అమెరికాలో కోవిడ్ వైరస్ వల్ల ఎంతోమంది ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో తానా చేస్తున్న ఫుడ్ డ్రైవ్ కార్యక్రమాన్ని పలువురు అభినందిస్తున్నారు.