పిట్స్‌బర్గ్‌లో తానా ఫుడ్‌ డ్రైవ్‌

TANA Food Drive Programme in Pittsburgh

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో నిరుపేదల సహాయార్థం నిర్వహిస్తున్న ఫుడ్‌ డ్రైవ్‌ కార్యక్రమాన్ని పిట్స్‌బర్గ్‌లో కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా జూబ్లి కిచెన్‌కు వారు ఆహార పదార్థాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ అట్లూరి, ఇండియన్‌ ఆర్మీలో పనిచేసి రిటైరైన రమేష్‌బాబు, ఆయన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శ్రీఅట్లూరి మాట్లాడుతూ, తానా అధ్యక్షుడు జయ్‌ తాళ్ళూరి, కార్యదర్శి రవి పొట్లూరి, మాజీ అధ్యక్షుడు సతీష్‌ వేమన, ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌ అంజయ్య చౌదరి లావుతోపాటు ఇతర తానా నాయకులు సతీష్‌ చుండ్రు, అశోక్‌బాబు కొల్లా, రవిచంద్ర వడ్లమూడి, శరత్‌ కొమ్మినేని తదితరుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించామని చెప్పారు. 

Click here for Photogallery