హమ్ దర్ద్ లేబొరేటరీస్ ఇండియా (ఫుడ్ డివిజన్ ) నుంచి హమ్ దర్ద్ హనీ

Hamdard Laboratories India Foods Division launches Hamdard Honey

100 సంవత్సరాలకు పైగా వారసత్వాన్ని కలిగి, భారతదేశపు అతిపెద్ద, ఎఫ్ఎంసీజీ మరియు ఆహార రంగంలో అత్యంత విశ్వసనీయ సంస్థల్లో ఒకటి హమ్‌దార్డ్ లాబొరేటరీస్ ఇండియా. ‘నేచురల్ బ్లోసమ్‌హనీ’ ఆవిష్కరణతో కంపెనీ తన ఉత్పత్తి పోర్ట్‌ ఫోలియోను విస్తరిస్తోంది. హమ్‌దర్ద్ నుండి వస్తున్న తేనె, ప్రకృతిలో లభ్యమయ్యే తేనె  స్వచ్ఛమైన రూపం సమర్థత మరియు సహజ ఆనందానికి నిదర్శనం.

హమ్ దర్ద్ లేబొరేటరీస్ ఇండియా చీఫ్ ముతావలి శ్రీ హహ్మద్ అహ్మద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘తాను విశ్వసించిన సూత్రాలకు కట్టుబడి హమ్ దర్ద్ ఎప్పుడూ సహజసిద్ధంగా ఉండేలా, ఆరోగ్య ప్రయోజనాలను అందించే లా తన ఉత్పత్తులను ప్రవేశపెడుతోంది. అవి అత్యున్నత స్థాయి నాణ్యత, స్వచ్ఛతతో ఉంటాయి. హమ్ దర్ద్ హనీ ఆవిష్కరిస్తున్నందుకు మేమెంతో గర్విస్తున్నాం. అది ఈ కీలక విలువలకు ప్రతీక’’ అని అన్నారు.
 

ఆవశ్యక ఆహారపదార్థంగా తేనె కు పెరిగిపోతున్న డిమాండ్ తో పాటుగా సహజసిద్ధ మరియు వనమూలికల ఉత్పా దనలపై వినియోగదారుల్లో పెరుగుతున్న చైతన్యాన్ని హమ్ దర్ద్ లేబొరేటరీస్ ఇండియా (ఫుడ్ డివిజన్) గుర్తిం చింది. ప్రతి ఇంట్లో  తేనెతో ఓ ప్రత్యేక ఆహార విభాగమే ఏర్పడింది. 

నేటి కాలంలో తేనె అనేది వంటింటి చిట్కా మాత్రమే కాదు, ఇప్పుడు పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో ప్రాసెస్ చేసిన చక్కెరలకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా కనిపిస్తుంది. ఒక విభాగంగా తేనె ఇప్పుడు సముచిత ఉపయోగం నుండి వినియోగదారులలో విస్తృతంగా వినియోగించే జీవనశైలి ఉత్పత్తిగా మారింది.

హమ్ దర్ద్ యొక్క నేచురల్ బ్లోసమ్ మల్టీఫ్లోరల్ హనీ ఒక సహజ శక్తి బూస్టర్‌గా పనిచేస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది, సహజ యాంటీఆక్సిడెంట్. దగ్గులో ఉపశమనం కలిగించడం మరియు ప్రోబయోటిక్‌గా పనిచేయడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. బ్రాండ్‌పై వినియోగదారుల నమ్మకానికి నిదర్శనంగా హమ్ దర్ద్ (ఫుడ్స్ డివిజన్) నాణ్యత మరియు స్వచ్ఛత పరంగా అత్యున్నత ప్రమాణాలను ప్రదర్శించే ఒక ఉత్పత్తిని మరోసారి విజయవంతంగా ఆవిష్కరించింది. ఈ మనోభావానికి అనుగుణంగా, “హమ్ దర్ద్ హై, ప్యూర్ హై ” అని ఈ బ్రాండ్ కమ్యూనికేషన్ చాటిచెబుతుంది.

హమ్ దర్ద్ లాబొరేటరీస్ ఇండియా (ఫుడ్స్ డివిజన్) సిఇఒ హమీద్ అహ్మద్ మాట్లాడుతూ, ‘‘భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు ఉత్తమమైన సహజమైన మరియు ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులను అందించడం హమ్ దర్ద్ ఫుడ్ డివిజన్ ఆశయం. తేనె ఉత్పాదనను ఆవిష్కరించడం వినియోగదారులకు ఆనందాన్ని కలిగించే మరో అడుగు. దాని ద్వారా పోషక ప్రయోజనాలు పొందగలుగుతారు’’ అని అన్నారు.

హమ్ దర్ద్ యొక్క నేచురల్ బ్లోసమ్ హనీ 3 వేర్వేరు పరిమాణాలలో - 50 గ్రాములు, 250 గ్రాములు మరియు 500 గ్రాముల పిఇటి బాటిల్స్ లో వరుసగా రూ.35, రూ.110 మరియు రూ.199 సరసమైన ధరలకు లభిస్తుంది. మార్కెట్ లో సంస్థ త్వరలోనే వివిధ ప్రమోషన్లను చేపట్టనుంది. ఈ ఉత్పత్తి ఇప్పుడు దేశంలోని అన్ని ప్రధాన మార్కెట్లలో ఉంది.


 


                    Advertise with us !!!