
దేశంలో ఇతర నగరాలకన్నా హైదరాబాద్ నగరం అద్భుతంగా అభివృద్ధిలో ముందుకు వెళ్తుందని నైట్ ఫ్రాంక్ సీఎండీ శశిర్ బైజల్ పేర్కొన్నారు. కొత్త రాష్ట్రం అయినప్పటికీ ఇన్ఫాస్ట్రక్చర్ రంగంలో శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. తెలంగాణ ప్రభుత్వ నూతన పాలసీలు రియల్ ఎస్టేట్ అభివృద్ధికి దోహదం చేస్తున్నాయని, హైదరాబాద్ నగరంలో హైటెక్ సిటీ ఏరోస్పేస్తో పాటు ఇతర రంగాలు అభివృద్ధి చెందడంతో ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగం ఊపకుందుకుందని తెలిపారు. హైదరాబాద్‌లోనూ కన్జ్యూమర్ డిమాండ్ చాలా ఎక్కువగా ఉందని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో మరింత ముందుకెళ్తుందని చెప్పారు. ఇండివిడ్యువల్ హౌస్‌తో పాటు ఆఫీస్ స్పేస్‌కు కూడా హైదరాబాద్‌లో డిమాండ్ ఉందని శశిర్ బైజల్ తెలిపారు.