డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి సరికొత్త చరిత్ర

Ritchie Torres wins House race and will become first Black member of Congress who identifies as gay

అమెరికా ఎన్నికల్లో డెమొక్రటిక్‍ పార్టీ అభ్యర్థి రిచీ టోరెస్‍(32) సరికొత్త చరిత్ర సృష్టించాడు. యూఎస్‍ కాంగ్రెస్‍ (పార్లమెంట్‍)కు ఎన్నికైన తొలి నల్ల జాతి స్వలింగ సంపర్కుడిగా(గే) టోరెస్‍ రికార్డుకెక్కాడు. ప్రస్తుతం న్యూయార్క్ సిటీ కౌన్సిల్‍ సభ్యుడిగా పని చేస్తున్న ఆయన న్యూయార్క్ రాష్ట్రంలోని 15వ కాంగ్రెషనల్‍ జిల్లా నుంచి పార్లమెంట్‍కు ఎన్నికయ్యాడు. తన సమీప ప్రత్యర్థి రిపబ్లికన్‍ పార్టీ అభ్యర్థి పాట్రిక్‍ డెలిసెస్‍ను ఓడించాడు. నేటి నుంచి కొత్త శకం మొదలవుతుందని టోరెస్‍ వ్యాఖ్యానించాడు. తన గెలుపు పట్ల ఆనందం వ్యక్తం చేశారు. తాను ఆఫ్రో-లాటినో అని టోరెస్‍ తరచూ చెబుతుంటాడు. 2013 నుంచి సిటి కౌన్సిల్‍ సభ్యుడిగా కొనసాగుతున్నారు.

 


                    Advertise with us !!!