
డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా వైట్‌హౌస్ సమీపంలో వెయ్యి మందికిపైగా ఆందోళనలు చేశారు. వందలాది మంది వాషింగ్టన్లో ర్యాలీలు నిర్వహించారు. కొందరు ట్రాఫిక్‌ను అడ్డుకున్నారు. సియాటిల్ నుంచి న్యూయార్క్ దాకా ఆందోళనలు జరిగాయి. అయితే అమెరికా వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో హింస, ఆందోళనకరమైన పరిణామాలేవీ జరగలేదు. వాషింగ్టన్లో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఇవి ఎవరి వీధులు.. మన వీధులు.. మాకు న్యాయం జరగకపోతే.. మీరు శాంతియుతంగా ఉండలేరు.. అంటూ నినాదాలు చేశారు. ట్రంప్ ఎప్పుడూ అబద్దాలు చెబుతారని రాసివున్న బ్యానర్‌ను ప్రదర్శించారు. తమను చెదరగొట్టేందుకు వచ్చిన పోలీసుల వ్యాన్ టైర్లను ప్రదర్శనకారులు పదునైన ఆయుధాలతో గుచ్చి పనిచేయకుండా చేశారు.