జగన్ ఏడాదిన్నర పాలనపై ప్రజాభిప్రాయ సేకరణ- సజ్జల

Jagan successful in balancing welfare and development says Sajjala

నవంబరు 6వ తేదీ నుంచి పది రోజులపాటు- ప్రజలతోనే మమేకం అవుతూ ప్రజలను చైతన్యపరిచేందుకు, వారికి మేమున్నాం అనే భరోసా కల్పించేందు కు వైయస్సార్‍ కాంగ్రెస్‍ పార్టీ ఆధ్వర్యంలో కొన్ని కార్య క్రమాలు చేపట్టబోతున్నట్లు ఆపార్టీ రాజకీయ వ్యవహారాల ఇన్‍ఛార్జి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు. ఈమేరకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో   మీడియాతో మాట్లాడుతూ, వైయస్సార్‍ కాంగ్రెస్‍ పార్టీ అధ్యక్షుడు జగన్‍ మోహన్‍ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభమై నవంబరు 6వ తేదీ నాటికి 3 ఏళ్ళు పూర్తి అవుతున్న సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించిన కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లబోతున్నట్లు చెప్పారు. గడిచిన 14 నెలల పరిపాలనలో తాము ఎంతవరకూ సఫలీకృతం అయ్యాం.. ఇంకా ఏం చేయాలి.. ప్రజలకు ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా.. అనే అంశాలపై పార్టీ నాయకులు, కార్యకర్తలతో పది రోజులపాటు ఈ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతి పేద, మధ్య తరగతి కుటుంబం అభివృద్ధి కోసం తద్వారా ప్రజలకు ఒక భరోసా కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

2017 నవంబరు 6న ఇడుపులపాయ నుంచి మొదలు పెట్టిన పాదయాత్ర రాష్ట్రంలోని 134 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాగుతూ 14 నెలలపాటు- 3,648 కిలో మీటర్లు పొడువున ఇచ్ఛాపురం వరకూ సాగిందన్నారు.పాదయాత్ర ద్వారా ప్రజల్లో ఉంటూనే, సమర్థవంతంగా పార్టీని నడుపుతూ.. కొన్ని లక్షల మంది ప్రజలను నేరుగా కలిసి, వారి సమస్యలు వింటూ.. ఆ తర్వాత మరో మూడు నెలలపాటు- ఎన్నికల ప్రచారం చేశారన్నారు. ఎన్నికల్లో 151 సీట్లతో, 22 మంది ఎంపీలను గెలిపించి మే 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 17 నెలలుగా పరిపాలన చేస్తున్నారని తెలిపారు. మొదటి 14 నెలలు జనంలో ఉండి.. మరో 17 నెలలుగా జనం కోసం ప్రభుత్వాన్ని నడుపుతూ, ప్రజలకోసమే పూర్తిగా అంకితం అవుతూ పరిపాలన సాగిస్తున్నారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిన్నరలోనే 90 శాతంకు పైగా మేనిఫెస్టో హామీలు అమలు చేయడం ద్వారా ఇంకో రికార్డును సాధించారన్నారు.

ప్రజా జీవనంలో సమూలమైన మార్పు తెచ్చే విధంగా నూతన వ్యవస్థల ఏర్పాటు, పరిపాలనలో వికేంద్రీకరణ. సచివాలయాల ద్వారా గ్రామస్థాయిలోనే ప్రజల సమస్యల పరిష్కారం వంటివి ముఖ్యమైనవన్నారు. ఈరోజు గ్రామస్థాయి లో అవి సేవాలయాలుగా మారి, దరఖాస్తు చేసిన 10-15 రోజుల్లోనే రేషన్‍ కార్డు దగ్గర నుంచి పెన్షన్లు, ఇళ్ళ పట్టాలు, ఆరోగ్యశ్రీ కార్డులు.. ప్రభుత్వ సేవలన్నీ ప్రజల గడప వద్దకే వాలంటీ-ర్ల ద్వారా అందుతున్నాయన్నారు. వాస్తవానికి, ఇవన్నీ చేయాలంటే మూడేళ్ళు, నాలుగేళ్ళు, అంతకు మించి పట్టే అవకాశముందన్నారు. కానీ, అధికారం లోకి వచ్చిన కొద్ది నెలల్లోనే ఎంతో గుండె నిబ్బంతో అద్భు తాలు సృష్టించిన నాయకుడుగా సీఎం జగన్‍ చరిత్రలో నిలచి పోతార్నారు. ఈరోజు ప్రభుత్వమే ఒక చోధక శక్తిగా, ఫెసిలిటేటర్‍గా ఉండటం వల్ల 360 రోజులు, 24 గంటలు పారదర్శకంగా ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సేవలు సకాలంలో అందుతున్నాయన్నారు. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చేనాటికి రూ. 96 వేల కోట్ల అప్పు ఉంటే..దిగిపోయే నాటికి అది రూ. 2.60 లక్షల కోట్లకు చేరి, మరో రూ. 60 వేల కోట్లు- పెండింగ్‍ బిల్లులతో ఆర్థిక పరిస్థితి ఘోరంగా తయారైందన్నారు. ఈ డబ్బు అంతా ఎక్కడికి పోయిందో ఆర్థిక నిపుణులు కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి ఉండే దన్నారు. ఇప్పుడేమో ప్రతిదీ పారదర్శకంగా చేస్తున్నామన్నారు.

 సమాజంలో పెనుమార్పులు తీసుకొచ్చేందుకు ఇంగ్లీషు మీడియం విద్య, ఇళ్ళు లేని నిరుపేదలకు 30 లక్షల ఇళ్ళ పట్టాలు, ఇళ్ళ నిర్మాణం.. ఇటు-వంటి కార్యక్రమాలు చేస్తుంటే, ప్రభుత్వం చేస్తున్న మంచిని అడ్డుకునేందుకు ప్రతిపక్షం ప్రతిదానిలో ఆటంకాలు కలుగుజేస్తుందని విమర్శించారు. నాడు ఆరోగ్యశ్రీ కింద వెయ్యి జబ్బులు ఉంటే.. ఇప్పుడు 2 వేల జబ్బులను చేరుస్తూ, రూ 5 లక్షలు ఆదాయం లిమిట్‍ అంటే.. నెలకు రూ 40 వేలు జీతం వచ్చే వాళ్ళకు కూడా, రూ. వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం చేస్తున్నామన్నారు. మహిళా పక్షపాతి ప్రభుత్వం, రైతు పక్షపాతి ప్రభుత్వం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేదల పక్షపాతి ప్రభుత్వంగా సీఎం జగన్‍ ప్రభుత్వం గుర్తింపు పొందిందన్నారు. 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు-, అమ్మఒడి, ఆసరా, చేయూత.. పేదవాళ్ళకు ఇళ్ళు.. ఇలా ఏ పథకం తీసుకున్నా మహిళలకే పెద్ద పీట వేస్తున్నామన్నారు. ఈరోజు మహిళలకు బ్యాంకు రుణాలు ఇప్పించి, పెద్ద పెద్ద కార్పొరేట్‍ కంపెనీలతో -టైఅప్‍ చేయించి వారిని ఆర్థికంగా శక్తివంతులను చేస్తున్నామని తెలిపారు.