
పోలింగ్‌కు ఒక్క రోజు ముందు అమెరికా అద్యక్ష ఎన్నికల అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ సుడిగాలి ప్రచారం నిర్వహించారు. ట్రంప్ మిషిగన్, లోవా, ఉత్తర కరోలినా, జార్జియా, ఫ్లోరిడా రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ పెన్సిల్వేనియాలో ప్రచారం నిర్వహించారు. ఓటర్లను ఆకట్టుకొనేందుకు చివరి ప్రయత్నంగా తమతమ విధానాల గురించి విడమర్చి చెప్పారు. ఎన్నికల్లో కీలకంగా మారిన భారతీయ అమెరికన్ ఓటర్లను తమవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నించారు. అమెరికాలో 25 లక్షల మంది భారతీయ అమెరికన్ ఓటర్లు ఉన్నారు. హోరాహోరీగా పోటీ ఉన్న టెక్సాస్, మిషిగాన్, ఫ్లోరిడా, పెన్సిల్వేనియా రాష్ట్రాల్లోనే భారతీయ అమెరికన్ల ఓట్లు 13 లక్షలు ఉన్నాయి.