
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్జి జో బైడెన్‌కు భారత సంతతి ఓటర్లు ఆర్థికంగా కూడా మద్దతు నిలిచారు. ఎన్నికల ప్రచారం కోసం భారీగా విరాళాలిచ్చారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారం కోసం తమ పార్టీకి కనీసం రూ.80 లక్షలు అంతకంటే ఎక్కువ నిధులు సమకూర్చిన 800 మంది దాతల పేర్లను బైడెన్ వెల్లడించారు. వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ జాబితాలో భారత సంతతి అమెరికన్లు చాలా మంది ఉన్నారు. లిస్టులో స్వదేశ్ చటర్జీ, రమేశ్ కపూర్, శేఖర్ ఎన్ నరసింహన్, రంగస్వామి జైన్ భుటోరియా, ఫ్రాంక్ ఇస్లామ్ తదితరుల పేర్లు ఉన్నాయి. భారత సంతతికి చెందిన చట్టసభ్యురాలు ప్రమీల జయపాల్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఎన్నికల ప్రచారం కోసం బైడెన్ దాదాపు రూ.800 కోట్లు సేకరించారు. ఇంత భారీ మొత్తంలో విరాళాలు సేకరించిన మొట్టమొదటి అధ్యక్ష అభ్యర్థి బైడెన్ అని సీఎన్ఎన్ వార్త సంస్థ పేర్కొన్నది.