2016లో కంటే ఈ సారి భారీ మెజారిటీ ...

there-will-be-superlatives-trump-is-about-to-make-history-no-matter-what-happens

అమెరికాలో మంగళవారం (3వ తేదీ)న అధ్యక్ష ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍ తప్పకుండా మళ్లీ విజయం సాధించి మళ్లీ అధ్యక్షుడిని అవుతానని చెప్పారు. 2016లో జరిగిన ఎన్నికల కంటే ఈసారి భారీ మెజారిటీ సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గత నాలుగు సంవత్సరాలలో తమ ప్రభుత్వం ఎన్నో విజయాలు సాధించిందని తెలిపారు. డెమోక్రటిక్‍ పార్టీ నుంచి అభ్యర్థిగా నిలిచిన జో బైడెన్‍ అవినీతిపరుడని ఆరోపించారు. ఆయన గెలిస్తే అమెరికాలో సామ్యవాదం రాజ్యమేలుతుందని తెలిపారు. అలాగే, దేశంలో పనులు విపరీతంగా పెరిగిపోతాయని హెచ్చరించారు.

అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో తనకు దేశవ్యాప్తంగా మద్దతు వస్తోందని, దీంతో డెమోక్రటిక్‍ నేతలు ఏమీ చేయలేకపోతున్నారని చెప్పారు. ప్రజలు మంగళవారం (3వ తేది) అమెరికా కలని సాకారం చేయబోతున్నారని పెన్సిల్వేనియా ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తన పాలనలో అమెరికాను సైనికపరంగా, రక్షణపరంగా మరింత బలోపేతం చేశామని చెప్పారు. తన ప్రభ్యర్థి బైడెన్‍ ప్రణాళికలు మాత్రం దేశాన్ని నాశనం చేస్తాయని అన్నారు. తమ విధానాలు మాత్రం దేశాన్ని మళ్లీ గొప్ప దేశంగా నిలబెడతాయని చెప్పుకొచ్చారు.

 


                    Advertise with us !!!