ఏపీలో జాన్స్ హాప్కిన్స్ సెంటర్ ఫర్ ఎక్స్ లెన్స్

AP govt will sign MoU with Johns Hopkins University

అమెరికాకు చెందిన ప్రముఖ విశ్వవిద్యాలయం జాన్స్ హాప్‍కిన్స్ ఆంధప్రదేశ్‍ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ముందుకొచ్చింది. వైద్య రంగంలో పరిశోధనలకు విశాఖపట్నంలో సెంటర్‍ ఫర్‍ ఎక్స్ లెన్స్  ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు పంపింది. ఈ మేరకు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‍రెడ్డి గురువారం వివరాలు వెల్లడించారు. ఇండియన్‍ స్కూల్‍ ఆఫ్‍ బిజినెస్‍ (ఐఎస్‍బీ)తో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి మాట్లాడుతూ ఈ- గవర్నెన్స్ లో మరో స్థాయిని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా నైపుణ్యాలు పెంచడం, పాలసీ ల్యాబ్‍ ఏర్పాటుకు ఐఎస్‍బీతో కలిసి కృషి చేస్తున్నామన్నారు. కాగా ఏపీలో కోవిడ్‍, టీబీ, డెంగీ, హైపటైటిస్‍ వంటి వ్యాధుల చికిత్సకు ఉపయోగపడేలా కేంద్రీకృత డేటా సెంటర్‍ను ఐఎస్‍బీ సహకారంతో ప్రతిపాదనలు పంపింది. రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయి క్లినికల్‍ ట్రయల్స్ కేంద్రంగా తీర్చిదిద్దుతామంది.