సీఎం జగన్ తో పోస్కో ప్రతినిధుల భేటీ

Posco Officials Meets CM YS Jagan Mohan Reddy

ఆంధప్రదేశ్‍ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్టీల్‍ ఉత్పత్తి సంస్థ పోస్కో తెలిపింది. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‍ జగన్‍తో పోస్కో ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భారీ స్థాయిలో తమ సంస్థను రాష్ట్రంలో ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు వారు ముఖ్యమంత్రి జగన్‍కు చెప్పారు. రాష్ట్రంలో అత్యంత పారదర్శక విధానాలు అమలు చేస్తున్నామని, ఇవి పారిశ్రామిక రంగానికి మేలు చేస్తాయని ముఖ్యమంత్రి జగన్‍ ఈ సందర్భంగా వారికి బదులిచ్చారు. పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే సంస్థలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. సహజవనరులపరంగా రాష్ట్రానికి ఉన్న సానుకూల అంశాలు పరిశ్రమల అభివృద్ధికి తగిన తోడ్పాటునందిస్తాయన్నారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో పోస్కో ఇండియా గ్రూప్‍ చైర్మన్‍, మేనేజింగ్‍ డైరెక్టర్‍ సంగ్‍ లై చున్‍, చీఫ్‍ ఫైనాన్సింగ్‍ ఆఫీసర్‍ గూ యంగ్‍ అన్‍, సీనియర్‍ జనరల్‍ మేనేజర్‍ జంగ్‍ లే పార్క్ తదితరులున్నారు.

 


                    Advertise with us !!!