భారత్లో 80 లక్షలు దాటిన కరోనా కేసులు

India s total covid tally cross 80 lakh mark

భారత్‍లో కరోనా వైరస్‍ పాజిటివ్‍ కేసుల సంఖ్య 80 లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో 49,881 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 80,40,203కి చేరింది. నిన్న ఒక్కరోజే 517 మంది మరణించగా ఇప్పటివరకు మొత్తం 1,20,527 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కరోనాపై హెల్త్ బులెటిన్‍ విడుదల చేసింది. నిన్న 56,480 మంది కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అవ్వగా ఇప్పటి వరకు మొత్తం 73,15,989 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్‍ కేసుల సంఖ్య 6,06,687గా ఉంది.

 


                    Advertise with us !!!