ప్రకృతి పరిరక్షణలో నిహాల్ తమ్మనకు అవార్డులు

Nihal was awarded National Waste Recycling Award for 2020

న్యూజెర్సిలోని ఎడిసన్‍లో ఉంటున్న 11 సంవత్సరాల బాలుడు నిహాల్‍ చిన్న వయస్సులోనే ప్రకృతి పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్నాడు. తండ్రి వంశీ తమ్మన సహకారంతో రీసైకిల్‍ మైబ్యాటరీ పేరుతో వెబ్‍సైట్‍ను స్టార్ట్ చేసి బ్యాటరీలను సేకరించి రీసైక్లింగ్‍ చేస్తున్నాడు. ఇంతవరకు దాదాపు 38,000 బ్యాటరీలను ఆతను రీసైక్లింగ్‍ చేసినట్లు తండ్రి వంశీ తమ్మన తెలుగుటైమ్స్ తో మాట్లాడుతూ చెప్పారు. అతను చేస్తున్న పర్యావరణ కృషికిగాను 2020 సంవత్సరానికిగాను న్యూజెర్సి స్టేట్‍ రీసైక్లింగ్‍ అవార్డ్ తో పాటు, వన్‍ ఇన్‍ ఎ మిలియన్‍ అవార్డు కూడా లభించింది. న్యూజెర్సిలోని పలువురు సెనెటర్లు కూడా నిహాల్‍ చేస్తున్న కృషిని అభినందించారు. వంశీ తమ్మన స్కిల్‍ సంస్థకు కో ఫౌండర్‍గా, ఐటీ సర్వ్ అలయన్స్ కు నేషనల్‍ పిఆర్‍ మీడియా డైరెక్టర్‍గా, ఓంసాయిబాలాజీ టెంపుల్‍ ఎగ్జిక్యూటివ్‍ బోర్డ్ మెంబర్‍గా ఉన్నారు.

 


                    Advertise with us !!!