15 తర్వాత ఏపీ అసెంబ్లీ!

AP Assembly Sessions May After November 15

ఆంధప్రదేశ్‍ అసెంబ్లీ సమావేశాలను నవంబరు 15వ తేదీ తర్వాత నిర్వహించనున్నారు. వారం రోజుల పాటు ఈ సమావేశాలను నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. నవంబరు 4న రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలపై చర్చించనున్నారు. సమావేశాల ప్రారంభ తేదీ, ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశాలపై మంత్రి మండలి భేటీ తర్వాతే సృష్టత రానుంది. మంత్రి మండలి సమావేశానికి సంబంధించిన ప్రతిపాదనలు, నివేదికలను నవంబరు 2వ తేదీలోపు సమర్పించాలని ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదేశించారు.