ఏపీకి 382... తెలంగాణకు 250 మంది

the-division-of-police-officers-is-complete

ఆంధప్రదేశ్‍, తెలంగాణ రాష్ట్రాల మధ్య పోలీసు అధికారు విభజన ఎట్టకేలకు పూర్తయింది. రాష్ట్రస్థాయి పోస్టులైన డీఎస్పీ, అడిషనల్‍ ఎస్పీ, నాన్‍ కేడర్‍ ఎస్పీ పోస్టుల్లో 632 మంది అధికారులు ఉండేవారు. అయితే 2014 జూన్‍ తర్వాత రాష్ట్ర విభజన జరిగినా.. అధికారికంగా కేంద్రం నోటిఫికేషన్‍ విడుదల చేయలేదు. ఆంధప్రదేశ్‍ నుంచి తెలంగాణకు, అటు నుంచి ఏపీకి మార్చుకోవడానికి కొంతకాలం పాటు అధికారులకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అవకాశం ఇచ్చాయి. సుదీర్ఘ కాలం తర్వాత స్పందించిన కేంద్రం ఆంధప్రదేశ్‍కు 58 శాతం, తెలంగాణకు 42 శాతం మంది అధికారులను కేటాయించింది. మొత్తం 632 మందిలో ఆంధప్రదేశ్‍కు 382, తెలంగాణకు 250 మందిని ఖరారు చేసింది.

 

 


                    Advertise with us !!!