వరసిద్ధుడి ఆలయానికి ప్రవాసాంధ్రుడు భారీ విరాళం

NRI donates one lakh American dollars to Kanipakam temple in AP

ఆంధప్రదేశ్‍ రాష్ట్రంలో చిత్తూరు జిల్లా కాణిపాకంలోని స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి ఓ అజ్ఞాత ప్రవాసాంధ్రుడు భారీగా విరాళం ఇచ్చినట్లు ఆలయ ఈవో వెంకటేశు తెలిపారు. లక్ష అమెరికన్‍ డాలర్లను ఆలయ ఖాతాలో జమ చేసినట్లు ఈవో వివరించారు. ఇది భారత కరెన్సీ  ప్రకారం రూ.72.88 లక్షలకు సమానమన్నారు. దాత అందించిన విరాళంలో 50 వేల డాలర్లు గోసంరక్షణ, మరో 50 వేల డాలర్లను నిత్యాన్నదాన పథకాలకు వినియోగిస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా దాతకు ఈవో అభినందనలు తెలిపారు.