నాలుగైదు యేళ్ళ వరకు మహేష్ బాబు డైరీ ఫుల్ : మహేష్ ఫాన్స్ కి పండగే పండగ

Super Star Mahesh Babu Dairy Full Four Years

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అతి త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట. మహేష్ బాబు ఇప్పటివరకు చేయని సరికొత్త పాత్రలో నటిస్తున్నాడు.   ఈ సినిమాకు యువ దర్శకుడు పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించనుండగా తొలిసారిగా మహేష్ కు జోడిగా కీర్తి సురేష్ ఇందులో హీరోయిన్ గా నటించనుంది. ఇటీవల ఈ సినిమా నుండి మహేష్ జన్మదినం సందర్భంగా రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కు సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల నుండి కూడా మంచి రెస్పాన్స్ లభించిన విషయం తెలిసిందే. ఇక అతి త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అమెరికా లో  ప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే. 14 రీల్స్ ప్లస్, మైత్రి మూవీ మేకర్స్, జి.ఎం.బి ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు కలిసి ఎంతో భారీ రేంజ్ లో నిర్మించనున్న ఈ సినిమాకు సంగీతాన్ని తమన్ అందిస్తుండగా ఫోటోగ్రఫీని మది అందిస్తున్నారు.

 

ఇకపోతే దీని తర్వాత దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు ఒక భారీ ప్రతిష్టాత్మక సినిమా చేయనున్న విషయం తెలిసిందే. సీనియర్ నిర్మాత కె.ఎల్ నారాయణ తన దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై భారీ లెవల్లో ఈ సినిమా రూపొందించనున్నారు. దీని తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక హాసిని క్రియేషన్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు కలిసి నిర్మించనున్న సినిమాతో పాటు దిల్ రాజు బ్యానర్ లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో కూడా మహేష్ నటించనున్నారు. అలానే మరో సారి  యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం లో ఒక సినిమా, అలానే ప్రముఖ తమిళ దర్శకుడు కార్తీక్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కూడా మరో సినిమా చేయనున్నారు మహేష్ బాబు. ఇప్పటికే వీటికి సంబంధించి కొద్ది రోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. ఈ విధంగా వరుసగా సినిమాలు ఎంచుకుంటున్న మహేష్ బాబు కెరీర్  చూస్తుంటే రాబోయే రోజుల్లో ఆయన నుండి వరుసగా అద్భుతమైన చిత్రాలు  వస్తున్న నేపధ్యం లో మహేష్  ఫ్యాన్స్ కి ఇది అతి పెద్ద పండుగ.