ఎమ్మెల్సీ పదవికి సునీతా రాజీనామా

Pothula Sunitha Resigns As TDP MLC

ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పెద్ద షాక్‍ తగిలింది. టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆంధప్రదేశ్‍ శాసన మండలి చైర్మన్‍కు తన రాజీనామా పత్రాన్ని పంపారు. రాష్ట్రంలో టీడీపీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆమె ప్రకటించారు. టీడీపీ గత కొద్దిరోజులుగా ఏపీ అభివృద్ధి అడ్డుపడుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీ వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని పేర్కొన్నారు. ఆంధప్రదేశ్‍ ముఖ్యమంత్రి వైఎస్‍ జగన్‍ మోహన్‍ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని, సంక్షేమ పథకాలను టీడీపీ అడ్డుకుంటోందన్నారు.

 


                    Advertise with us !!!