సొంతగూటికి రాములమ్మ?

Vijayashanti to rejoin BJP

సినీ నటి విజయశాంతి సొంత గూటికి చేరడానికి సిద్ధమవుతోంది. బీజేపీలోకి చేరేందుకు రాములమ్మకు లైన్‍ క్లియర్‍ అయినట్టు తెలుస్తోంది. కేంద్ర హోంశాఖ మంత్రి కిషన్‍ రెడ్డి విజయశాంతిని హైదరాబాద్‍లోని ఆమె నివాసంలో భేటీ అయ్యారు. దాదాపు అరగంట పాటు ఈ ఇద్దరు మాట్లాడుకోగా, కాషాయ కండువాను కప్పుకునేందుకు ఆమెకు లైన్‍ క్లియర్‍ అయినట్లు తెలుస్తోంది. విజయశాంతి 1998లో బీజేపీలో చేరి రాజకీయ ఓనమాలు నేర్చుకుని తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. బీజేపీ మహిళా మోర్చా కార్యదర్శిగా కూడా పని చేశారు.