కొత్త సినిమాలు లేవు, ప్రేక్షకులు రారు.... అయోమయంలో థియేటర్ యజమానులు

Coronavirus Impact on Film Industry

కరోనా ఎఫెక్ట్ తో అన్ని పరిశ్రమల మాదిరిగానే సినీ పరిశ్రమకు గట్టి దెబ్బే తగిలింది. కొన్ని వేల కోట్ల బిజినెస్ చేసే థియేటర్ పరిశ్రమ.. లాక్ డౌన్ తో తన గ్రాండియర్ లుక్ కోల్పోయింది. ఆఫ్టర్ లాక్ డౌన్ అన్ని పరిశ్రమలకు ఇచ్చినట్లు సినిమా హాళ్లకు కూడా పర్మీషన్ వస్తుందనుకున్నారు. కానీ ఆ రావడం చాలా లేట్ అయింది. అప్పటికే ఎంటర్ టైన్ మెంట్ లవర్స్ వినోదరంగంలో అందుబాటులో ఉన్న ఆప్షన్స్ కు లాక్ అయిపోయారు. వారు చూడాల్సిన సినిమాను ఓటీటీలో చూడడం మొదలు పెట్టారు.  లాక్ డౌన్ తర్వాత థియేటర్ల ఓపెనింగ్ డేట్ వచ్చి అప్పుడే పదిరోజులు అయ్యింది. ఇప్పటివరకు అసలు ఎన్ని థియేటర్లు తెరుచుకున్నాయో తెలియదు. కొన్ని చోట్ల  షోలు పడుతున్నాయి అంటున్నారు, వసూళ్లు లేక  వెంటనే ఆపేశారంటున్నారు అని కొందరంటున్నారు. అసలు థియేటర్లు తెరిచారా లేదా తెరిచినా థియేటర్లలో ఏ సినిమాలను ఆడిస్తున్నారు? ఇటీవల చిన్న సినిమాలు గాని పెద్ద సినిమాలు గాని విడుదలలు లేనే లేవు అక్టోబర్ 2 న నిశ్శబ్దం, ఒరేయ్ బుజ్జిగా చిత్రాలు రిలీజ్ అయ్యాయి కానీ అవి ఓ టి టి లో విడుదల అయ్యాయి.   ఓటీటీల ఉదృతితో థియేటర్ వ్యవస్థను కాపాడుకునే క్రమంలో దేశవ్యాప్తంగా నిర్మాతల నుంచి వచ్చిన ఒత్తిడికి తలొగ్గిన కేంద్రం చివరకు  అక్టోబర్ 15నుంచి థియేటర్లను 50శాతం ఆక్యుపెన్సీతో రన్  చేసుకోమని ఆదేశాలు జారీ చేసింది. అప్పటివరకు ఓటీటీలకు వెళ్లకుండా వెయిట్ చేసిన సినిమాలన్నీ ఖచ్చితంగా థియేటర్లో రిలీజ్ అవుతాయనుకున్నారంతా. దీనికి తోడు దసరా పండగ కూడా రావడంతో  మూడు నాలుగు ప్రెస్టీజియస్  సినిమాలైన రిలీజై మళ్లీ థియేటర్లకు పూర్వ వైభవం తీసుకు వస్తాయనుకున్నారు.

ఇక విషయానికొస్తే తెలుగు ప్రజలకు  దసరా అనేది ఒక పెద్ద పండగ అదే విధంగా సినిమా వారికీ కూడా విడుదలల పండగ అయితే.... ఒక్కటంటే ఒక్క సినిమా కూడా థియేటర్లో పడలేదు. బి,సి సెంటర్స్ లో  కొన్ని థియేటర్లు వచ్చీరాని కలెక్షన్స్ తో పాత సినిమాలను రన్ చేసుకోవల్సిన పరిస్థితి వచ్చింది. ప్రభుత్వాలు ఆదేశాలు ఇచ్చినప్పటికీ థియేటర్ వ్యవస్థ ఎందుకిలా పడకేసిందీ అనేవాళ్లు ఉన్నారు. అయితే ఇక్కడంతా థియేటర్ల వ్యవస్థను ప్రశ్నిస్తున్నారు తప్ప.. నిర్మాతలను ప్రశ్నించడం లేదు. ఇక్కడ ఎగ్జిబిటర్ అనేవాడు  థియేటర్ ను ఓపెన్ చేయడానికి ఎప్పెడూ రెఢీగానే ఉంటాడు. మరి పంపిణీదారుడి కొత్త సినిమాను ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు. ఇక్కడ మనకు ప్రధానంగా కనిపించే సమస్య ఒక్కటే.. కరోనా సెకండ్ వేవ్ హెచ్చరికలతో థియేటర్లు కనీసం 10శాతం ఆక్యుపెన్సీని కూడా అందుకోలేక పోతున్నాయి. ఇక షోకు తెగే జస్ట్ 20, 30 టికెట్లతో క్యూబ్ సిస్టమ్, థియేటర్ రన్నింగ్ లకు రెంట్ ఎవరు కడతారు. నేడు సినిమాకు మునుపటిలా జనాలు రావాలంటే ఓ ప్రెస్టీజియస్ ఫిలిం థియేటర్లో రిలీజ్ అవ్వాల్సి ఉంది. ఇప్పుడున్న సమయంలో కాదు ఇంకో రెండు నెలల పాటు ఏ సినిమా రిస్క్ చేసి రిలీజ్ అయ్యే పరిస్థితులలో లేదు. అప్పటికి కరోనా శాంతిస్తే జనాలు బయటకు రావచ్చు.  లేదంటే ఈ పరిస్థితి ఇంకొన్ని రోజుల పాటు కంటిన్యూ అవ్వవచ్చు. మునుపటిలా థియేటర్ కి వచ్చి సినిమా చూసే  ప్రేక్షకుడు కరువయ్యాడు ఇలా అయితే ఎగ్బిటర్ రంగం కుదేలవడం ఖాయం.   

 


                    Advertise with us !!!