వాళ్ళు ఇచ్చిన వార్నింగ్ కి రాజామౌళి వెనక్కు తగ్గినట్లేనా?

BJP MP Soyam Bapu Rao Warns SS Rajamouli

ఆర్ ఆర్ ఆర్  సినిమా గురించి ప్రస్తుతం  ఎన్నో చర్చలు జరుగుతున్నాయి.ఈ చిత్రం షూటింగ్ జరుగుతుందా లేదా?  ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది ఏంటి అనే దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత కూడా లేదు. అయితే ఈ సినిమా రామరాజు ఫర్ బీమ్ టీజర్ రిలీజ్ అయినప్పటినుండి  ఇప్పుడు వివాదాలు కాస్త ఎక్కువగానే వస్తున్నాయి. తాజాగా ప్రముఖ దర్శకుడు రాజమౌళికి ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఈ సినిమాలో ముస్లిం సన్నివేశాలను తొలగించాలని లేకపోతే మాత్రం సినిమా విడుదలను అడ్డుకునే అవకాశం ఉందని ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయంలో రాజమౌళి మర్యాదగా వ్యవహరించాలని లేకపోతే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు చిత్ర దర్శకుడు ఈ కథలో కొన్ని మార్పులు చేసే అవకాశాలు ఉండవచ్చు అని టాలీవుడ్ జనాలు భావిస్తున్నారు. 

ఈ సినిమాలో ఇప్పటికే కొన్ని సన్నివేశాలను తొలగించారని మరి కొన్ని సన్నివేశాల విషయంలో కూడా త్వరలోనే ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. రాజకీయంగా ఈ సినిమా విషయంలోదుమారం రేగక ముందే చాలా వరకు జాగ్రత్తగా ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. చరిత్రను వక్రీకరిస్తే గతంలో పద్మావతి అనే సినిమాను కూడా నిలిపేసిన విషయం విదితమే. ఆ తర్వాత చిత్ర దర్శకుడు చాలా సన్నివేశాలను సినిమా నుంచి తొలగించారు. సినిమా టైటిల్ నే మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది.  పద్మావతి బదులు పద్మవత్ గా మార్చారు.    దీనితో సినిమా లో పట్టు లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో రాజమౌళి కూడా కొన్ని కీలక సన్నివేశాలను తొలగించి అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. దీనిపై త్వరలోనే ఒక క్లారిటీ రానుంది. ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది ఏంటి అనేది లేదు కానీ ఈ సినిమా షూటింగ్ మాత్రం ప్రస్తుతం వికారాబాద్ జిల్లాలో జరుగుతోంది.  ఇక ఈ సినిమాలో హీరోయిన్లు గా ఇద్దరు  నటిస్తున్న సంగతి తెలిసిందే. అటు  బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు.