జనవరి 26న కొత్త జిల్లాలపై ప్రకటన

announcement-about-new-districts-in-ap-on-january-26-says-deputy-speaker-kona-raghupathi

ఆంధప్రదేశ్‍ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి వచ్చే ఏడాది జవనరి 26న సృష్టమైన ప్రకటన ఉంటుందని శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి తెలిపారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్‍ నియోజకవర్గాల వారీగా జిల్లాలు ఏర్పాటు చేయాలని భావించినా.. అరకు నియోజకవర్గం విషయంలో ఏర్పడిన సంక్లిష్టతతో మొత్తం 26 జిల్లాలు ఏర్పాటవుతాయని ఆయన వివరించారు. వాన్‍ పిక్‍ భూముల్లో కొందరు సాగు పనులు చేపట్టడాన్ని రఘుపతి తప్పుబట్టారు. అప్పట్లోనే రైతులకు పరిహారం ఇచ్చారని, భూములు వాన్‍ పిక్‍ సంస్థకు స్వాధీనం చేశారని తెలిపారు. ఈ విషయంలో కొందరు గందరగోళం రేపేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. నిజాంపట్నం పోర్టుని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

 


                    Advertise with us !!!