ఉగ్రవాదుల జాబితాను ప్రకటించిన కేంద్రం

18-individuals-declared-as-terrorists-under-the-uapa-act

ఉగ్రవాదంపై కేంద్ర ప్రభుత్వ పోరాటం కొనసాగుతూనే ఉంది. చట్టవ్యతిరేక కార్యకలాపాల రక్షణ చట్టం (యూఏపీఏ) 1967 కింద కొత్తగా 18 మందిని ఉగ్రవాదులుగా ప్రకటించారు. జాతీయ భద్రతను బలోపేతం చేయడంలో, జీరో టాలరెన్స్ విధానంలో భాగంగా మోదీ సర్కార్‍ 18 మంది వ్యక్తులను ఉగ్రవాదులుగా గుర్తించినట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. యూఏపీఏ చట్టంలోని నాలుగవ షెడ్యూల్‍లో ఉగ్రవాదుల పేర్లను చేర్చింది. జాబితాలో ఉన్న వారి పేర్లు ఇవే. సాజిద్‍ మీర్‍, యూసుఫ్‍ ముజమ్మిల్‍, అబ్దుల్‍ రెహ్మాన్‍ మక్కి, షాహిద్‍ మెహమూద్‍, ఫర్హతుల్లా ఘోరీ, అబ్దుల్‍ రౌఫ్‍ అస్గర్‍, ఇబ్రహీం అత్తర్‍, యూసుఫ్‍ అజహర్‍, షాహిద్‍ లతిప్‍, సయ్యిద్‍ మొహమ్మద్‍ యూసుఫ్‍ షా, గులామ్‍ నబీ ఖాన్‍, జాఫర్‍ హుస్సేన్‍ భట్‍, రియాజ్‍ ఇస్మాయిల్‍ షాబాద్రి, మహ్మద్‍ ఇక్బాల్‍, షేక్‍ షకీల్‍, మహ్మద్‍ అనిస్‍ షేక్‍, ఇబ్రహీమ్‍ మీనన్‍, జావెద్‍ చిక్నాలు ఆ లిస్టులో ఉన్నారు. దేశ సరిహద్దుల్లో వీరంతా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

 


                    Advertise with us !!!