వేటా ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు

WETA bathukamma sambaralu in California

కాలిఫోర్నియాలో బతుకమ్మ సంబరాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉమెన్‍ ఎంపవర్‍ మెంట్‍ తెలుగు అసోసియేషన్‍(వేటా) ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను ఈసారి కూడా ఘనంగా నిర్వహించారు. వేటా వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి ఝాన్సీ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో సోషల్‍ డిస్టెన్స్ పాటిస్తూ మాస్కులు ధరించి వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. వేడుకల్లో పాల్గొన్న మహిళలందరూ సంప్రదాయక దుస్తులు ధరించి ఎంతో కోలాహలంగా బతుకమ్మ ఆడారు. శైలజ కల్లూరి, అనురాధ ఏలిశెట్టి, ప్రశాంతి కూచిభట్ల, విశ్వ వేమిరెడ్డి, యశస్విని రెడ్డి, హైమ అనుమాండ్ల, సుగుణ రెడ్డి, లక్ష్మి యనమందల, జ్యోతి పెంటపర్తి, పూజ లక్కడి, చిన్మయి అరుకల, శిరీష కాలేరు మరియు రేఖా రెడ్డి తదితరులు పాల్గొని జయప్రదం చేసారు.


                    Advertise with us !!!