ఏటీఎస్ఏ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబురాలు

ATSA Bathukamma Sambaralu 2020

సిడ్నీలోని ఆస్ట్రేలియన్‍ తెలంగాణ స్టేట్‍ అసోసియేషన్‍ (ఏటీఎస్‍ఏ) ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలను వర్చువల్‍ పద్ధతిలో ఘనంగా నిర్వహించారు. సంఘం ప్రతినిధులు కొవిడ్‍ నిబంధనలను పాటిస్తూ ఈ ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళలు, యువతులు, చిన్నారులు సంప్రదాయాన్ని చాటేలా పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ దేశాలకు చెందిన తెలుగువారు జూమ్‍ యాప్‍ ద్వారా ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు. జబర్దస్త్ ఫేం కెవ్వు కార్తీక్‍ తన మాటలతో నవ్వులపూలు పూయించారు. గాయకులు శ్రీవాస్‍ తిరునగిరి, రవికుమార్‍ మంద, వీణ మేడ్చల్‍ తమ పాటలతో అందరినీ అలరించారు. చక్కగా పాటలు పాడిన చిన్నారులకు బహుమతుల్ని కూడా ప్రకటించారు. ఈ సందర్భంగా ఏటీఎస్‍ఏ ఆధ్యక్షురాలు పావని రాగిపాని మాట్లాడుతూ గత పదిహే నేళ్లుగా తమ సంఘం ద్వారా బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వేడుకలను సహకరించిన వారికి సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‍ తునమ్మనపల్లి కృతజ్ఞతలు తెలిపారు.