అధ్యక్ష గెలుపును నిర్ణయించేవి ఈ రాష్ట్రాలే ....

US President Election 2020

అమెరికా అధ్యక్ష అభ్యర్థుల మధ్య పోటీ హోరా హోరీగా ఉండే రాష్ట్రాలను బ్యాటిల్‍ గ్రౌండ్‍ స్టేట్స్ అంటారు. అమెరికాలో మొత్తం 50 రాష్ట్రాలు ఉండగా ప్రస్తుతం 14 రాష్ట్రాల్లో డొనాల్డ్ ట్రంప్‍, జో బిడెన్‍ మధ్య పోటీ నువ్వా-నేనా అనే విధంగా ఉన్నది. అధ్యక్ష ఎన్నికల అంతిమ ఫలితాలను నిర్ణయించేవి కూడా ఈ రాష్ట్రాలే. 2016 అధ్యక్ష ఎన్నికల్లో మిగతా రాష్ట్రాల్లో మంచి ప్రదర్శన కనబరిచిన అప్పటి డెమోక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్‍.. ఈ 14 రాష్ట్రాల్లో ఎలక్టార్లను (స్థానాల్ని) గెలుచుకోవడంలో తడబడ్డారు. దీంతో ఆమె అధ్యక్ష పీఠానికి దూరమయ్యారు. అయితే, ఈ  కీలక రాష్ట్రాల్లో ఇప్పటికే బ్యాలెట్‍ ద్వారా ఓట్లేసిన చాలా మంది ఓటర్లు తమ మద్దతు జో బిడెన్‍కే అని చెప్పినట్లు నివేదిక వెల్లడించింది. ఈ జాబితాలో ఫ్లోరిడా, నార్త్ కరోలినా తదితర రాష్ట్రాలు ఉన్నాయి.