అణ్యాయుధ నిషేధానికి 50 దేశాలు ఓకే

un-treaty-to-ban-nuclear-weapons-to-come-into-force-after-50th-signatory

అణ్వాయుధ నిషేధ ఒప్పందంపై ఇప్పటి వరకూ 50 దేశాలు సంతకం చేశాయని ఐక్యరాజ్య సమితి (ఐరాస) పేర్కొంది. జపాన్‍లోని హిరోషిమా, నాగసాకిలపై అణ్వస్త్రాలతో దారుణమైన దాడి జరిగి 75 ఏళ్ల అవుతున్న సందర్భంగా అణ్వస్త్రాల నిషేధ ప్రతిపాదనతో ఐరాస ముందుకొచ్చింది. అయితే, అణ్వస్త్ర దిగ్గజాలైన యూఎస్‍, రష్యా, చైనా, బ్రిటన్‍, ఫ్రాన్స్ లతో పాటు భారత్‍, పాక్‍, ఉత్తర కొరియా, ఇజ్రాయెల్‍ వాటి మిత్రదేశాలు ఓటింగ్‍కు దూరంగా ఉండడం గమనార్హం.