ఐటీఆర్ గడువు పొడిగింపు

Deadline for filing ITR by individual taxpayers others extended Finance ministry

పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. గత ఆర్థిక సంవత్సరానికి (2019-20)గాను వ్యక్తిగత ట్యాక్స్పేయర్లు రిటర్నులు దాఖలు చేయడానికి ఉన్న గడువును మరోసారి పొడిగింది. ఆదాయం పన్ను రిటర్నుల (ఐటీఆర్‍) ఫైలింగ్‍ చివరి తేదీని నవంబర్‍ 30 నుంచి డిసెంబర్‍ 31కి పెంచుతున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఓ ప్రకటనలో తెలియజేసింది. కరోనా వైరస్‍ నేపథ్యంలో జూలై 31 నుంచి నవంబర్‍ 30కి ఇంతకుముందు పొడిగించిన విషయం తెలిసిందే. ఇదిలావుంటే ఐటీ ఆర్‍ దాఖలు చేసేవారి ఖాతాలు ఆడిటింగ్‍ గడువునూ అక్టోబర్‍ 31 నుంచి వచ్చే ఏడాది జనవరి 31 వరకు పొడిగించారు.