అమెరికాలోకి గ్రాన్యూల్స్ ఔషధం

Granules India gets USFDA approval for potassium chloride tablets

గ్రాన్యూల్స్ ఇండియాకు చెందిన పొటాషియమ్‍ క్లోరైడ్‍ ట్యాబ్లెట్‍కు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్‍ఎఫ్‍డీఏ) మార్కెటింగ్‍ అనుమతి ఇచ్చింది. హైపోకలేమియా అనే వ్యాధికి చికిత్సలో ఈ ఔషధాన్ని వినియోగిస్తారు. హైపోకలేమియా అంటే రోగి రక్తంలో పొటాషియమ్‍ బాగా తగ్గి పోవటమే. ఈ ట్యాబ్లెట్‍ను 750 ఎంజీ, 1500 ఎంజీ డోసుల్లో విక్రయించడానికి తమకు అనుమతి లభించినట్లు గ్రాన్యూల్స్ ఇండియా పేర్కొంది. ఈ ఔషధాన్ని హైదరాబాద్‍లోని గాగిల్లాపూర్‍ యూనిట్లో తయారు చేస్తున్నట్లు వెల్లడించింది. యూఎస్‍లో గత ఏడాది కాలంలో పొటాషియమ్‍ క్లోరైడ్‍ ఔషధం 204 మిలియన్‍ డాలర్ల అమ్మకాలను నమోదు చేసింది.