చి|| ప్రదీప్ కి చి|| ల|| సౌ|| శ్రీముఖి నమస్కరిస్తూ వ్రాయునది', అంటూ అంబరాన్నంటే దసరా సంబరాలతో మీ ముందుకు వస్తుంది జీ తెలుగు

This Dussehra celebrate festivity with Zee Telugu s Chi Pradeep Ki Chi La Sow Sreemukhi Namaskaristu Vrayunadi

జీ తెలుగు - మమతానురాగాలుకు పుట్టినిల్లు. అభిమానుల అభిరుచులకు తగ్గట్టుగా తనని తాను తీర్చిదిద్దుకుంటూ, ప్రేక్షకులకు ఏది అవసరమో ఆ వినోదాన్ని అందిస్తూ ఉంటుంది. ఈ దసరా సమయంలో మనల్ని అలరించడానికి ఈసారి ఒక సరికొత్త రూపం దాల్చబోతుంది. పండుగ అంటేనే సంతోషం - చుట్టాలు, స్వీట్లు, నవ్వులతో ఇల్లు మొత్తం ఒక స్వర్గం లాగా మారిపోతుంది. కానీ ప్రస్తుత సమయంలో ఒకరినినొకరు పలకరించుకోవడానికే బయపడి పోతున్నారు.

అందుకే అందరి ఇంటిలో సంతోషాలని వెదచల్లడానికి, మళ్లీ మనకు దసరాని కళ్ళకి కట్టినట్టుగా చూపించడానికి 'దసరా పండుగ అంట' అనే పాటను, స రి గ మ ప సీజన్ 13 యొక్క కంటెస్టెంట్లతో కలిసి ఒక పాట విడుదల చేయబోతుంది. అలాగే, అంతులేని వినోదం, నవ్వులు, డ్రామా, నాన్‌స్టాప్‌ గా ఎంటర్టైన్ చేసేందుకు జీ తెలుగు సిద్ధంగా ఉంది.ఈ దసరా మహోత్సవాన్ని ‘చి|| ప్రదీప్ కి చి|| ల|| సౌ|| శ్రీముఖి నమస్కరిస్తూ వ్రాయునది' కార్యక్రమంతో మరింత అందంగా, ఆనందంగా మార్చబోతోంది. ఈ కార్యక్రమం అక్టోబర్ 25 సాయంత్రం 5 గంటలకు మీ జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్‌డి చానళ్ళలో ప్రసారం కాబోతుంది.

అద్భుతమైన సెట్స్‌, బుల్లితెర స్టార్స్‌ యొక్క ఆకట్టుకునే పర్ఫార్మెన్స్ లతో ‘చి|| ప్రదీప్ కి చి|| ల|| సౌ|| శ్రీముఖి నమస్కరిస్తూ వ్రాయునది' కార్యక్రమం సూపర్బ్‌ కలర్‌ఫుల్‌ ఈవెంట్‌గా మారింది. ఈ కార్యక్రమానికి హైలెట్‌ నవ్వుల షెహన్షా నాగబాబు, ఆయన గారాల పట్టి నిహారిక కొణిదెల. ఈ కార్యక్రమాన్ని టెలివిజన్ రాములమ్మ శ్రీముఖి, అందరి ఇంటి ముద్దు బిడ్డ ప్రదీప్ మాచిరాజు ముందు ఉండి నడిపించి కన్నులపండుగగా మార్చేశారు. అనసూయ భరద్వాజ్, జానీ మాస్టర్, పండు మాస్టర్, చంద్ర, వేణు, ధన్ రాజ్, గల్లి బాయ్స్ తో పాటు ఇంకా చాలామంది బుల్లితెర నటీనటులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా ఉల్లాసంగా పాలుపంచుకున్నారు

ఎప్పుడూ అభిమానుల భావాలకి తగ్గట్టుగా తనని తాను మార్చుకుంటున్న జీ తెలుగు, ఈ కార్యక్రమం లో ఈ దేశం గర్వించదగిన కల్నల్ సంతోష్ బాబు కి నివాళి అర్పిచ్చింది. తెలుగోడి సత్తా చాటిన సంతోష్ బాబు , ఇండియన్ ఆర్మీ ఆఫీసర్. బాబీ మరియు మహేష్, C/0 కంచెర్లపాలెం సినిమా నుంచి ఆశాపాశం, పాటకు డాన్స్ చేసి ఆయనకు సంతోష్ బాబుకి నివాళులు అర్పించారు.

అలాగే, ఒక పాట - ఎంత బాధలో ఉన్నా సంతోషం లో ఉన్నా మనకు ఓదార్పు, ధైర్యం దానితో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా అదే. అదే పండుగ పాట అయితే ఇంక చెప్పనక్కర్లేదు. ఏవో పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటాం. అందుకే జీ తెలుగు 'దసరా పండుగ అంట' పాటను స రి గ మ ప కంటెస్టెంట్స్ భరత్, యశస్వి, ప్రజ్ఞ, అనన్య, వెంకట చైతన్య చేత పాడించారు. సాకేత్ కొమండ్రి స్వరపరచగా - సాగర్ నారాయణ ఎం ఈ పాట రాసారు. జీ తెలుగు ఈ సీజన్ అయిపోయే లోగా మరికొన్ని ఒరిజినల్ ట్రాక్స్ కూడా విడుదల చేయబోతున్నారు.

మరి మిస్ అవకుండా "దసరా పండుగ అంట' అనే పాటను 21 అక్టోబర్ న విని ఇంకా చూసి అందిందించండి, అలాగే 25 న చి|| ప్రదీప్ కి చి|| ల|| సౌ|| శ్రీముఖి నమస్కరిస్తూ వ్రాయునది' కార్యక్రమం సాయంత్రం 5 గంటలకు చూసి ఎంజాయ్ చేయండి మీ జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్ డి ఛానెళ్లలో. ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేయడానికి జీ తెలుగు సబ్ స్క్రైబ్ చేసుకోండి.

జీ తెలుగు ప్రైమ్ ప్యాక్ నెలకు 20 రూపాయలు మాత్రమే. మీ అభిమాన జీ తెలుగు కార్యక్రమాల్ని మిస్ అవ్వకండి. జీ తెలుగు, జీ సినిమాలతో పాటు జీ నెట్ వర్క్ కుచెందిన 7 టాప్ ఛానెల్స్ తో ఉన్న జీ ప్రైమ్ ప్యాక్ ను ఎంచుకోండి. నెలకు కేవలం 20 రూపాయలకు మీకుటుంబమంతటికీ కావాల్సిన వినోదాన్ని అందించే ప్యాక్. మరిన్ని వివరాలకు మీ దగ్గర్లోని డీటీహెచ్ లేదాకేబుల్ ఆపరేటర్ ను సంప్రదించండి.