కరోనా కల్లోలం ఇంకెంతకాలం?

India ranks 56th among 200 countries on Covid 19

ప్రపంచదేశాల్లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రికవరీ పెరిగినట్లే పెరిగి అదేస్థాయిలో కొత్త కేసులు పుట్టుకురావడంతో ఈ కల్లోలానికి అంతం లేదా అన్నట్లుగా మానవాళి భయపడిపోతోంది. ప్రపంచంలోని సుమారు 200కు పైగా దేశాల్లో వ్యాపించిన ఈ వైరస్‍ కారణంగా మొత్తం 4.04 కోట్లమంది ఇప్పుడు చికిత్సలు పొందుతున్నారు. అలాగే 11.20 లక్షలమంది ఈ వ్యాధి బారినపడి మృతి చెందారు. ప్రతి పది లక్షలమందిలో 5180 మంది కరోనా సోకుతుంటే 144 మంది చనిపోతున్నట్లు అంతర్జాతీయ వైద్య ఆరోగ్య సంస్థలు అంచనా వేసాయి. అభివృద్ధి చెందిన దేశాల్లోనే అత్యధికంగా ఈ కరోనా కేసులు నమోదవుతున్నాయి. అమెరికా అగ్రస్థానంలో ఉంది. 83.90 లక్షల కేసులు నమోదయ్యాయి. 2.25 లక్షల మంది కన్ను మూసారు. భారత్‍లో కూడా 75.52 లక్షల మందికి వైరస్‍ సోకింది. వారిలో 1.15 లక్షల మంది వరకూ మృతి చెందినట్లు వైద్య శాఖ ప్రకటించింది. ఇక మూడో దేశంగా బ్రెజిల్‍ 52.35 లక్షలమంది వైరస్‍ సోకితే వారిలో 1.54 లక్షల మంది చనిపోయారు.