దుబ్బాక బరిలో 23 మంది

23 contestants in fray for Dubbaka assembly bypoll

తెలంగాణ రాష్ట్రంలోని దుబ్బాక శాసనసభ నియోజకవర్గ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారంతో ముగిసింది. ప్రధాన పార్టీలు టీఆర్‍ఎస్‍, కాంగ్రెస్‍, బీజేపీలతో పాటు మొత్తం 23 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ స్థానంలో పోటీ చేసేందుకు 46 మంది నామినేషన్లు సమర్పించారు. ఈ నెల 17న చేపట్టిన పరిశీలనలో 12 మంది నామినేషన్లను తిరస్కరించారు. 11 మంది తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం పోటీలో ఉన్న 23 మందిలో 15 మంది స్వతంత్ర అభ్యర్థులు. నవంబరు 3న ఉప ఎన్నిక జరగనుంది.