తెలంగాణలో 948 కరోనా కేసులు

948 new corona positive cases in telangana

తెలంగాణ రాష్ట్రంలో 26,027 నిర్థారణ పరీక్షలు చేయగా, అందులో 948 మందికి కరోనా వైరస్‍ సోకినట్టు ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు వెల్లడించారు. ఒక రోజులో 1,896 మంది కోలుకోగా, నలుగురు చనిపోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 38,56,530 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, 2,23,059 మంది వైరస్‍ బారినపడ్డారు. అందులో 2,00,686 మంది కోలుకున్నారు. ఈ మేరకు సోమవారం ఆయన కరోనా బులిటెన్‍ విడుదల చేశారు. ఇప్పటివరకు 1,275 మంది వైరస్‍తో మరణించారు. ఇక ప్రస్తుతం 21,098 యాక్టివ్‍ కేసులు ఉండగా, ఇందులో 17,432 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ప్రతీ పది లక్షల జనాభాలో 1,03,614 మందికి నిర్ధారణ పరీక్షలు చేశారు.