ఏపీలో 2,918 మందికి పాజిటివ్

2918 new corona positive cases in ap

ఆంధప్రదేశ్‍ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 61,330 పరీక్షలు చేయగా 2,918 మందికి పాజిటివ్‍గా నిర్ధారణ అయినట్టు వైద్యారోగ్యశాఖ బులెటిన్‍లో పేర్కొంది. ఇప్పటి వరకు మొత్తం 71,27,533 పరీక్షలు చేయగా, మొత్తం పాజిటివ్‍ కేసుల సంఖ్య 7,86,050కి చేరింది. ఒక్క రోజులో 4,303 మంది కోలుకోగా, ఇప్పటి వరకు మొత్తం 7,44,532 మంది కరోనాను జయించారు. తాజాగా 24 మంది మృతితో మొత్తం మరణాలు 6,453కి చేరాయి. ఇంకా యాక్టివ్‍ కేసులు 35,065 ఉన్నాయి.