ఎన్టీఆర్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపిన డ‌బ్బూ ర‌త్నాని!

Jr NTR Six Pack Hot Look For RRR Movie

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో నిర్మాణంలో ఉన్న సినిమాల్లో ఆర్ ఆర్ ఆర్‌కి ఉన్న క్రేజ్ మ‌రే సినిమాకూ లేదు. ఎందుకంటే ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ వంటి యంగ్ హీరోలు, రాజ‌మౌళి వంటి ద‌ర్శ‌ధీరుడు కాంబినేష‌న్‌లో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. లాక్‌డౌన్ వ‌ల్ల షూటింగ్‌కి అంత‌రాయం క‌లిగింది త‌ప్ప లేక‌పోతే ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ అయిపోయేది. చాలా గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ షూటింగ్ ప్రారంభ‌మైంది. వీలైనంత త్వ‌ర‌గా సినిమాను ఫినిష్ చేసెయ్యాల‌ని యుద్ధ ప్రాతిప‌దిక‌న ప‌ని మొద‌లు పెట్టాడు రాజ‌మౌళి. అన్నీ అనుకున్న‌ట్టుగా జ‌రిగితే వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌కి సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌న్న‌ది చిత్ర యూనిట్ ప్లాన్‌. అప్ప‌టివ‌ర‌కు క‌రోనా ఉధృతి త‌గ్గి థియేట‌ర్స్ మ‌ళ్ళీ య‌ధావిధిగా ర‌న్ అవుతాయ‌న్న న‌మ్మ‌కంతోనే సినీ ప‌రిశ్ర‌మ ఉంది. ఇప్ప‌టికే ఈ సినిమాకి సంబంధించిన డిజిట‌ల్ రైట్స్ 200 కోట్ల‌కు అమ్ముడుపోయాయ‌న్న వార్త ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 

ఇదిలా ఉంటే ప్ర‌ముఖ ఫోటోగ్రాఫ‌ర్ డ‌బ్బూ ర‌త్నాని ఒక ఫోటోను త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేయ‌డంతో అది వైర‌ల్‌గా మారి అంద‌రి మ‌న‌సుల్లోనూ ర‌క‌ర‌కాల ఊహ‌ల‌కు తావిస్తోంది. ష‌ర్ట్ లేకుండా కండ‌ల‌తో డ‌బ్బూతో క‌లిసి ఎన్టీఆర్ దిగిన ఈ ఫోటో ఆర్ ఆర్ ఆర్ చిత్రంలోనిదా అనే సందేహం క‌లిగేలా ఉంది. అయితే ఆ సినిమాలో ఎన్టీఆర్ గెట‌ప్ అది కాదు కాబ‌ట్టి ఆ సినిమాలోనిది అయ్యే అవ‌కాశం లేదు. అస‌లు ఈ ఫోటో ఎక్క‌డి నుంచి వ‌చ్చింది. దాన్ని డ‌బ్బూ ఎందుకు పోస్ట్ చేశాడూ అనే వివ‌రాల్లోకి వెళితే.. అర‌వింద స‌మేత సినిమా కోసం ఎన్టీఆర్ ఫోటో షూట్ నిర్వ‌హించాడు డ‌బ్బూ. ఆ స‌మ‌యంలో ఎన్టీఆర్‌తో క‌లిసి తీయించుకున్న ఈ ఫోటోను ఇప్పుడు ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశాడు. అది కాస్తా వైర‌ల్‌గా మారి ర‌క‌ర‌కాల డిస్క‌ష‌న్స్‌కి దారి తీసింది. ఏది ఏమైనా ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఆ ఫోటో చూశాక ఆనందంలో మునిగి తేలుతున్నారు. మ‌రోప‌క్క మ‌రో మూడు రోజుల్లో ఆర్ ఆర్ ఆర్ చిత్రంలోని ఎన్టీఆర్ లుక్ బీమ్ ఫ‌ర్ రామ‌రాజు రాబోతోంది. ఆ లుక్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న అభిమానులను సంతోష ప‌రిచేందుకు డ‌బ్బూ చేసిన ఈ ప్ర‌య‌త్నం వారిలో ఉత్సాహాన్ని నింపుతోంది.  

 


                    Advertise with us !!!