దుర్గమ్మకు ఎన్ఆర్ఐ భక్తుడు మణిహారం

gold-ornament-valuing-40-lakh-donated-to-kanaka-durga-temple

జెజవాడ దుర్గమ్మ చెంతకు మరో మణిహారం వచ్చి చేరింది. ఎన్‍ఆర్‍ఐ భక్తుడు తాతినేని శ్రీనివాస్‍ రూ.45 లక్షలు విలువ చేసే కనకపుష్యరాగ హారాన్ని అమ్మవారికి సమర్పించారు. ఈ హారాన్నీ ప్రతి గురువారం అమ్మవారికి అలంకరించనున్నారు. మరోవైపు శరన్నవరాత్రిని పురస్కరించుకుని అమ్మవారు గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. సకల మంత్రాలకు మూలమైన శక్తిగా, వేదమాతగా ప్రసిద్ధిపొందిన ముక్త, విద్రుమ, హేమనీల, దవళవర్ణాలతో ప్రకాశించే పంచముఖాలతో గాయత్రీదేవి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని భక్తులు తన్మయత్వంతో మునిగిపోతున్నారు.