75 లక్షలు దాటిన కరోనా కేసులు

Coronavirus Positive Cases in India

భారత్‍లో అంతకంతకూ అధికమవుతున్న కరోనా వైరస్‍ గడిచిన 24 గంటల్లో 55,722 పాజిటివ్‍ కేసులు నమోదవడంతో 75 లక్షల మార్కుని దాటింది. వైరస్‍ బాధితుల్లో తాజాగా 579 మంది మృతి చెందడంతో ఆ మొత్తం సంఖ్య 1,14,610 కు చేరింది. దేశ వ్యాప్తంగా మరో 66,399 మంది వైరస్‍ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 66,63,608. ప్రస్తుతం యాక్టివ్‍గా ఉన్న కేసుల సంఖ్య 7,72,055. ఈ మేరకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులెటిన్‍లో పేర్కొంది.

దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 88.26 శాతంగా ఉందని తెలిపింది. మొత్తం పాజిటివ్‍ కేసుల్లో 10.23 శాతం యాక్టివ్‍ కేసులున్నాయని వెల్లడించింది. మరణాల రేటు 1.52 శాతానికి తగ్గిందని తెలిపింది. గత 22 గంటల్లో దేశవ్యాప్తంగా 8,59,876 కోవిడ్‍ నిర్ధారణ పరీక్షలు చేయగా, మొత్తం పరీక్షల సంఖ్య 9,50,83,976 కు చేరిందని పేర్కొంది. ఇక 83,87,799 కేసులతో మొదటి స్థానంలో ఉండగా, 75,50,273 కేసులతో భారత్‍ రెండో స్థానంలో 52,35,344 కేసులతో బ్రెజిల్‍ మూడో స్థానంలో కొనసాగుతోంది. అమెరికాలో అత్యధికంగా 2,24,730 మంది కోవిడ్‍ బారిన పడి మరణించారు.