ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు

Atchannaidu As New President of AP TDP

ఆంధప్రదేశ్‍ తెలుగుదేశం పార్టీ (టీడీపీ) రాష్ట్ర అధ్యక్షుడిగా టీడీఎల్పీ ఉపనేత కింజరావు అచ్చెన్నాయుడు నియమితులయ్యారు. తెలంగాణ అధ్యక్షుడిగా ఎల్‍.రమణ రెండోసారి కొనసాగనున్నారు. ఈ మేరకు అధినేత చంద్రబాబు పార్టీ కమిటీలను ప్రకటించారు. 27 మంది సభ్యులతో టీడీపీ కేంద్ర కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మరో 25 మందితో టీడీపీ పొలిట్‍ బ్యూరో ఏర్పాటు చేశారు. 31 మందితో తెలంగాణ టీడీపీ రాష్ట్ర కమిటీనా ఏర్పాటు చేశారు. టీటీడీపీ సమన్వయ కమిటీలో ఆరుగురు సభ్యులను నియమించారు.

జాతీయ అధ్యక్షుడుగా చంద్రబాబు నాయుడు కొనసాగనుండగా, ఆరుగురిని ఉపాధ్యక్షులుగా నియమించారు. పార్టీ సీనియర్‍ నేతలు కావలి ప్రతిభా భారతి, గల్లా అరుణ కుమారి, డీకే సత్యప్రభతోపాటు, కోట్ల సూర్యప్రకాశ్‍ రెడ్డి, నాగేశ్వరరావు, కాశీనాథ్‍కు అవకాశం కల్పించారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేశ్‍కు మరోసారి అవకాశం కల్పించగా, యువనేత రామ్మోహన్‍ నాయుడును జాతీయ కార్యవర్గంలోకి తీసుకొని జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. వీరితో పాటు వర్ల రామయ్య, నిమ్మల రామానాయుడు, రవిచంద్ర, కొత్తకోట దయాకర్‍రెడ్డి, బక్కాని నర్సింహులను జాతీయ ప్రధాన కార్యదర్శులుగా నియమించారు.                కంపాటి రామ్మోహన్‍రావుకు జాతీయ రాజకీయ వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బాధ్యతలను అప్పగించారు. సంస్థాగత రాజకీయ కార్యదర్శిగా టీ జనార్థన్‍ను నియమించారు. పార్టీ జాతీయ కోశాధికారిగా శ్రీరామ్‍కు బాధ్యతలు అప్పగించారు.

టీడీపీ పొలిట్‍ బ్యూరోలోకి మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, కళా వెంకట్రావు, బొండా ఉమా, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బాలకృష్ణ, గల్లా జయదేవ్‍, ఫరూక్‍, రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి, పితాని సత్యనారాయణ, కొల్లు రవీంద్ర, గుమ్మడి సంధ్యారాణి తదితరులను తీసుకున్నారు. పార్టీ అధికార ప్రతినిధులుగా ఆరుగురికి అవకాశం కల్పించారు. ఎమ్మెల్సీ అశోక్‍బాబుతోపాటు తెలంగాణ నుంచి నర్సిరెడ్డి, జ్యోత్స్న, ప్రేమ్‍కుమార్‍ జైన్‍, నజీర్‍, దీపక్‍రెడ్డిలకు అవకాశం కల్పించారు. క్రమశిక్షణ సంఘం చైర్మన్‍ బచ్చుల అర్జునుడుకు బాధ్యతలు అప్పగించగా, మునిరత్నం, గుంటిపల్లి నాగేశ్వరరావు, వెంకటేశ్వరరావును సభ్యులుగా నియమించారు.